డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్
మెదక్, 13 నవంబర్ (హి.స.) మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు పోతున్నాయని, కుటుంబాలు దెబ్బతింటున్నాయని మెదక్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సే
మెదక్ ట్రాఫిక్ పోలీస్


మెదక్, 13 నవంబర్ (హి.స.)

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు పోతున్నాయని, కుటుంబాలు దెబ్బతింటున్నాయని మెదక్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది వాహనదారులను గుర్తించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి రూ.10 వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి దొరికితే రూ.15 వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ను ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తాం అని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. 'మీ భార్య, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి' అని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande