దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, 13 నవంబర్ (హి.స.) దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని మోసపోవద్దని మహబూబాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ మురళి నాయక్ అన్నారు. గురువారం వారు నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు, నెల్ల
ఎమ్మెల్యే మురళి నాయక్


మహబూబాబాద్, 13 నవంబర్ (హి.స.) దేశానికి అన్నం పెట్టే రైతన్న

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని మోసపోవద్దని మహబూబాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ మురళి నాయక్ అన్నారు. గురువారం వారు నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు, నెల్లికుదురు, రామన్నగూడెం సొసైటీ లతో పాటు, మునిగిలవీడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మురళి నాయక్.. రైతులకు సౌకర్యాలు కల్పించటంలో కేంద్రాల నిర్వాహకులు అశ్రద్ధ వహించొద్దన్నారు. ధాన్యం అమ్మకానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలిగించకుండా తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande