
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. గురువారం వారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీ కి ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో & టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.
ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్సుఖ్నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితో పాటు పలు డిపోలు నష్టాల బారిన పడటానికి కారణాలు, స్థానిక పరిస్థితులు, లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..