48కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 13 నవంబర్ (హి.స.) నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో రూ.48కోట్ల బడ్జెట్తో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గురువారం పరిశీలించారు. పనుల పురోగతి పై అక్కడి అ
మంత్రి వాకిటి


నారాయణపేట, 13 నవంబర్ (హి.స.)

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో రూ.48కోట్ల బడ్జెట్తో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గురువారం పరిశీలించారు. పనుల పురోగతి పై అక్కడి అధికారులను, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande