
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 13 నవంబర్ (హి.స.)
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో ఈ నెల 24 సాయంత్రం నుంచి రెండు రోజులపాటు రామ్‌లల్లా దర్శనం ఉండదు. నవంబరు 26 ఉదయం 7.00 గంటలకు దర్శనం పునఃప్రారంభం అవుతుంది. 25న రామమందిర శిఖర ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసే క్రమంలో భాగంగా రామయ్య దర్శనానికి విరామం ఇచ్చామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వివాహ పంచమి సందర్భంగా ఈ నెల 25న అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణం జరగనుంది. శ్రీరాముడు, సీతమ్మల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ