ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఓ పేదరలి సొంతింటి కల.నెరవేరింది
పశ్చిమగోదావరి జిల్లా, 13 నవంబర్ (హి.స.):ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో ఓ పేదరాలి సొంతింటి కల నెరవేరింది. ఏడాది క్రితం ఆమెకు ఇచ్చిన హామీని పవన్‌ కల్యాణ్‌ నిలబెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన కంకణాల కృష్ణవేణికి తాళ్ల
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఓ పేదరలి సొంతింటి కల.నెరవేరింది


పశ్చిమగోదావరి జిల్లా, 13 నవంబర్ (హి.స.):ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో ఓ పేదరాలి సొంతింటి కల నెరవేరింది. ఏడాది క్రితం ఆమెకు ఇచ్చిన హామీని పవన్‌ కల్యాణ్‌ నిలబెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన కంకణాల కృష్ణవేణికి తాళ్లకోడులో గత ప్రభుత్వంలో ఇంటిస్థలం మంజూరైంది. కానీ ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో గతేడాది మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద ఆమె పవన్‌ కల్యాణ్‌ను కలిసి తన సమస్యను వివరించింది. ఆయన స్పందించి ఆమెకు గృహం నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ నాగరాణి తన పరిధిలోని నిధులు రూ.1.50 లక్షలు, హౌసింగ్‌ నిధులు రూ.1.80 లక్షలతో గృహం నిర్మించి బుధవారం తాళాలు స్వయంగా కృష్ణవేణికి అందజేశారు. దీంతో కృష్ణవేణి సంతోషం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande