'మన బడి మన నీరు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
ఆదిలాబాద్, 13 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ''మన బడి మన నీరు'' కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంకుడు గుంతల నిర్మ
బోథ్ ఎమ్మెల్యే


ఆదిలాబాద్, 13 నవంబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల

కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం నిర్వహించిన 'మన బడి మన నీరు' కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో, ప్రతి పల్లెల్లో, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. నీటిని ఒడిసి పెట్టుకుంటేనే భవిష్యత్తులో మరింత మంచి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ మహోత్తర కార్యక్రమం నాడు కేసీఆర్ నాయకత్వంలో మొదలు పెట్టడం జరిగిందన్నారు. అంతేగాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో చాలా చోట్ల చెక్ డ్యామ్లు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణాలు మొదలు పెట్టారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande