
నిర్మల్, 13 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఈ రోజు విశ్వశాంతి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బాలశివ యోగీంద్ర మహారాజ్ దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంబ స్వాగతం పలికారు.అమ్మవారి సన్నిధిలో విశ్వశాంతి సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ బాలశివ యోగీంద్ర మహారాజ్ చే ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి ప్రత్యేక కుంకుమార్చన, పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో విశ్వశాంతి సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ బాలశివ యోగీంద్ర మహారాజ్ ఆశీర్వదించి శాలువాతో సత్కరించారు. ఆలయ సన్నిధిలో విశ్వశాంతి సంస్థ వ్యవస్థాపకుడు భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు