ప్రణాళికాబద్ధంగా తాండూరు నియోజకవర్గం అభివృద్ధి.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా వేగవంతం చేశామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికారులను సమన్వ
తాండూర్ ఎమ్మెల్యే


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా వేగవంతం చేశామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ నాణ్యతలో రాజీపడకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. గురువారం హైదరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో నీటిపారుదల, ఆర్ అండ్ బీ, భవనాల శాఖల అధికారులతో ఎమ్మెల్యే విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాండూరు నుంచి వికారాబాద్ వరకు జరుగుతున్న రోడ్డు పనులు, తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ దశల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande