
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
గేటు పడి బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బౌరంపేట లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. భవనం ముందు ఆడుకుంటున్న బాలుడిపై ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా ఇనుప గేటు పడడంతో బాలుడు స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటనలో చనిపోయిన బాలుడు మెదక్ జిల్లా కుకునూరుకు చెందిన ఆకాష్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..