
సూర్యాపేట, 13 నవంబర్ (హి.స.)
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం దుర్ఘటన చోటుచేసుకుంది. కంకర లోడుతో అతివేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఏర్పుల లింగయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పాలకవీడు మండలంలోని మహంకాళిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల లింగయ్య. దామరచర్లకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ కంకర లోడుతో వెళ్తూ అదుపు కోల్పోయి బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో లింగయ్య తలకు తీవ్ర గాయాలై, కాలు విరిగి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాణి, కూతురు మల్లేశ్వరి, కుమారుడు సాయి ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..