
నల్గొండ, 13 నవంబర్ (హి.స.) కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పది మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం బుగ్గతండా వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామానికి చెందిన పలువురు కూలీలో ఆటోలో నేరేడుగొమ్మ మండలం కచరాజ్పల్లి గ్రామంలో పత్తి ఏరేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుగ్గతండా వద్ద ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు