
సూర్యాపేట, 13 నవంబర్ (హి.స.)
వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ మహిళా భరోసా సెంటర్, జిల్లా షీ టీమ్స్ కార్యాలయాలను ఆయన సందర్శించి రికార్డ్స్ ను పరిశీలించి మాట్లాడారు. మహిళలు, పిల్లల రక్షణ చట్టాలు, శిక్షల అమలు గురించి ప్రజలకు వివరించాలని భరోసా సెంటర్, షీ టీమ్స్ సిబ్బందిని ఆదేశించారు. మహిళల, పిల్లల రక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు