వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు
వరంగల్, 13 నవంబర్ (హి.స.) వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ గురువారం ఎంజీఎం చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో 2021 నుంచి 20
విజిలెన్స్ తనిఖీలు


వరంగల్, 13 నవంబర్ (హి.స.)

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో

ఆరోగ్యశ్రీ నిధుల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ గురువారం ఎంజీఎం చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో 2021 నుంచి 2024 వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఆపరేషన్లు వచ్చిన నిధుల వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. ఈ నిధులు అవసరమైన పనులకు కాకుండా అనవసరమైన పనులకు వెచ్చించినట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తనిఖీలను చేపట్టారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎంజీఎం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కి సంబంధించి 30 కోట్లకు పైగా నిధులు ఆసుపత్రికి వచ్చాయి. ప్రతిరోజు ఈ పథకం కింద ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తున్నారు.

నిధుల ఖర్చు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో విజిలెన్స్ డిఎస్పి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలను చేశారు. సుమారు రెండు గంటల పాటు తమ తనిఖీలను నిర్వహించి అవసరమైన వివరాలు, రికార్డులను పరిశీలించి సంబంధించిన పత్రాలను తీసుకువెళ్లారు. మిగతా వివరాలను అడిగినప్పుడు పంపించాలని వైద్యులను కోరినట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande