
వరంగల్, 13 నవంబర్ (హి.స.)
రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట సోమిడిలో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. గతంలో కొనుగోలు కేంద్రం అందుబాటులో లేక రైతు దూర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి అమ్మే వారన్నారు. రైతు బలంగా ఉంటే గ్రామం బలంగా ఉంటుంది, గ్రామం బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుందన్నారు. గతంలో పాలించిన నేతలు కూడా సోమిడి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు