ఆరుగురు శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్‌ పురస్కారాలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
ఆరుగురు శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్‌ పురస్కారాలు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

బెంగళూరు:/ఢిల్లీ 13 నవంబర్ (హి.స.)

వివిధ విభాగాలకు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) అవార్డులు ప్రకటించింది. బెంగళూరులోని ఐఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపక మండలి అధ్యక్షుడు కె.దినేశ్, సభ్యులు నారాయణమూర్తి, శ్రీనాథ్‌ భాట్ని తదితరులు బుధవారం ఈ అవార్డు గ్రహీతలు, వారు చేసిన పరిశోధనల వివరాలు వెల్లడించారు. ఆర్థికశాస్త్రం విభాగంలో నిఖిల్‌ అగర్వాల్, ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సుశాంత్‌ సచ్‌దేవ, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఆండ్రూ ఆలెట్, లైఫ్‌సైన్స్‌ విభాగంలో అంజన బద్రీనారాయణన్, గణితశాస్త్రంలో సబ్యసాచి ముఖర్జీ, భౌతికశాస్త్రంలో కార్తీష్‌ మంథిరమ్‌లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. విజేతకు లక్ష డాలర్లు (రూ.88,57,000), ఒక స్వర్ణ పతకాన్ని బహుమతిగా అందజేస్తారు. పరిశోధనలు చేపట్టే యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి ఈ అవార్డులను ఇస్తున్నట్లు కె.దినేశ్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande