
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 13 నవంబర్ (హి.స.)
చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్ ముజమ్మిల్ గనయీ పదేపదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా?.. దీంతో వచ్చే నెల 6న భారీ ఉగ్రదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా? దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్కా ఆధారాలు అవుననే సమాధానమిస్తున్నాయి. హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక డాక్టర్ షాహీన్ సయీద్, డాక్టర్ గనయీలను పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అదేరోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్న విచారణలో నిర్ఘాంతపరిచే అంశాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు అనుమానితుల్ని జమ్మూకశ్మీర్ పోలీసులు విచారించగా తాము తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా దాడికి ప్రణాళిక వేశామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లో జనవరి మొదటివారంలో పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించామని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ