కాంగ్రెస్లో కలుపుమొక్కల్ని తీసేయాలి: ఏఐసీసీ కార్యదర్శి సంపత్
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా కలుపు మొక్కలు ఉన్నాయని, వాటిని తీసివేస్తే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. నేడు వారు గాంధీభవన్లో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే అ
ఏఐసీసీ కార్యదర్శి సంపత్


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా కలుపు మొక్కలు ఉన్నాయని, వాటిని తీసివేస్తే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. నేడు వారు గాంధీభవన్లో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే అన్ని క్యాడర్స్ లోనూ ప్రక్షాళన జరగాలన్నారు. రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చినవారు.. రెండేళ్ల తర్వాత ఎక్కడ ఎలా ఉంటారో తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు. తమలాంటి వారు చనిపోయేంతవరకూ పార్టీలోనే ఉంటారన్న సంపత్.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అవసరమని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ తనకొక అవకాశం ఇస్తే.. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande