
అమరావతి, 16 నవంబర్ (హి.స.)
:నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం.. నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ