
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)
నారాయణగూడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ ఎలక్ట్రిక్ కారు దగ్ధం కాగా.. మరో కారు పాక్షికంగా కాలిపోయింది. భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ