రాజేంద్రపాలెం బాలికల వసతి గృహంలో 13 మంది విద్యార్దులకు అస్వస్థతకు గురయ్యారు
కొయ్యూరు, 16 నవంబర్ (హి.స.) : రాజేంద్రపాలెం బాలికల వసతిగృహంలోని 13 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి ఏడుగురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా రాజేంద్రపాలెం పి.హెచ్.సికి తరలించారు. వారిలో ప
రాజేంద్రపాలెం బాలికల వసతి గృహంలో 13 మంది విద్యార్దులకు అస్వస్థతకు గురయ్యారు


కొయ్యూరు, 16 నవంబర్ (హి.స.)

: రాజేంద్రపాలెం బాలికల వసతిగృహంలోని 13 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి ఏడుగురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా రాజేంద్రపాలెం పి.హెచ్.సికి తరలించారు. వారిలో పదో తరగతి, ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవలను నిమిత్తం కేజీహెచ్ తరలించారు. ఆదివారం జ్వరంతో బాధపడుతున్న మరో ఆరుగురు విద్యార్థినులను పీహెచ్‌సీకి తరలించారు. వీరిని స్థానిక ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ పరామర్శించారు. వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వీరందరి ఆరోగ్యాలు బాగున్నాయని ఏటీడబ్ల్యూవో తెలిపారు. శనివారం రాత్రి ఓ విద్యార్థి పుట్టిన రోజు సందర్భంగా కేకు తినడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు సిబ్బంది తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande