
నాగర్ కర్నూల్, 16 నవంబర్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట
నియోజకవర్గ కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 63 నూతన జంటలను ఒకటి చేయడం జరిగిందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నల్లమల ప్రాంత ప్రజలకు ఉచిత సామూహిక వివాహాలు చేయడం చాలా మంచి పరిణామం అన్నారు. ఒకే వేదికపై 63 జంటలకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి వివాహం జరిపించడం గొప్ప కార్యక్రమమని నిర్వాహకులకు ఆ దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయన్నారు.
నల్లమల్ల ప్రాంతంలో పేదింటి ఆడబిడ్డలు గొప్పగా పెళ్లి జరుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగా సామూహిక వివాహాలు జరిగాయన్నారు. ప్రతి జంటను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయన సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ దంపతులు దగ్గర ఉండి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు