మేం కాంగ్రెస్ కు మద్దతివ్వలేదు.. నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేశాం: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఫలితంపై MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాము కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని, నవీన్ యాదవ్ కు పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే సపోర్ట్ ఇచ్చామన్నారు. కానీ మిగతా వాళ్లు
అసదుద్దీన్


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఫలితంపై MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాము కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని, నవీన్ యాదవ్ కు పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే సపోర్ట్ ఇచ్చామన్నారు. కానీ మిగతా వాళ్లు కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు భావించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్, తాను తమ పార్టీలకు ఏది మంచి అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని భావిస్తున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande