సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే..
ఆసిఫాబాద్, 16 నవంబర్ (హి.స.) రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం తాము కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే


ఆసిఫాబాద్, 16 నవంబర్ (హి.స.)

రైతు సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం తాము కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయాబీన్ ను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలన్నారు.

దళారులు, వ్యాపారుల చేతిలో మోసపోకుండా రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కేంద్రం కృషి చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande