నమ్మించి మోసం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది : బీసీ జేఏసీ
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలు చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్ బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ బీసీ జే
బీసీ జేఏఎస్


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల

సమయంలో ఇచ్చిన 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలు చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్ బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని డిమాండ్ చేశారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande