
నాగపూర్, 16 నవంబర్ (హి.స.)
కేంద్ర మంత్రి నితిన్ గట్కరీని ఆదివారం
మహారాష్ట్రలోని నాగ్పూర్ లో బీజేపీ ఎం.పి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవర్ రామరావ్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముధోల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ వినతి పత్రాన్ని అందించారు. బాసర నుండి మాహుర్ జాతీయ రహదారి అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రహదారి నిర్మాణ అంశంపై మంత్రితో ఎమ్మెల్యే పటేల్ చర్చించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో రోడ్ల నిర్మాణానికి నిధులు అవసరమని, ఆయన మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. రహదారులకు నిధులు మంజూరు విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పటేల్ తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..