జూబ్లిహిల్స్ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగింది : కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో ఉన్న హిందువులంతా ఓటుబ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం కూకట్ పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి హాజరైన ఆయన.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై కీల
బండి సంజయ్


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో ఉన్న హిందువులంతా

ఓటుబ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం కూకట్ పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి హాజరైన ఆయన.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లిహిల్స్ ఫలితాల తరువాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. అక్కడ ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇకనైనా హిందువులు మేల్కొని ఓటుబ్యాంకుగా మారాలన్నారు.మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన వారంతా ఘర్ వాపసీ రావాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande