హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)హఫీజ్ పేట్‌లోని రుమాల్ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో కిచెన్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న యజమాన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. వెంటనే విద్యుత్ సరఫరాను నిలి
హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)హఫీజ్ పేట్‌లోని రుమాల్ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో కిచెన్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న యజమాన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఆ వెంటనే హోటల్‌లో ఉన్నవారిని బయటకు రప్పించింది. డోర్లు తెరిచి ఉంచడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఇక, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande