
జగిత్యాల, 16 నవంబర్ (హి.స.)
జగిత్యాల జిల్లా, వేములవాడ
నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పెంటల బుజ్జమ్మ నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఆదివారం రోజున గృహ ప్రవేశ కార్యక్రమం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పెంటల బుజ్జమ్మ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజా ప్రభుత్వంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇల్లు లేని పేదల సొంత ఇంటి కల సహకారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు