
సిద్దిపేట, 16 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేది
కొండంత చేసేది గోరంత అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండల పరిధిలోని మల్లారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత చేసేది గోరంత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రైతులకు చెప్పలేని కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో కోట్ల పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 85 వేల మెట్రిక్ టన్నులు కొంటానని ఇప్పటివరకు కేవలం 6 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నేటికీ రైతులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..