దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి : : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, 16 నవంబర్ (హి.స.) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామంచర్ల
జనగామ ఎమ్మెల్యే


జనగామ, 16 నవంబర్ (హి.స.)

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామంచర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వారు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గుండెను ఎదురుగా పెట్టి పోరాడిన మహా యోధులు దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు.

భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయన ఆశయ సాధనకు అంకితభావంతో ముందుండి పోరాటాలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande