
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ అంశంలో వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..