తండ్రి రూపంలో రాక్షసుడు.. ఇద్దరు పిల్లల హత్యకు కుట్ర
కరీంనగర్, 16 నవంబర్ (హి.స.) కన్న తండ్రే ఇద్దరు పిల్లను హత్య చేయాలని ప్రయత్నించిన సంఘటన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లేశం అనే వ్యక్తికి భార్యతో పాటు ఆశ్రిత్, అర్చన అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఏమైంద
తండ్రి దారుణం


కరీంనగర్, 16 నవంబర్ (హి.స.)

కన్న తండ్రే ఇద్దరు పిల్లను హత్య

చేయాలని ప్రయత్నించిన సంఘటన కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లేశం అనే వ్యక్తికి భార్యతో పాటు ఆశ్రిత్, అర్చన అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో గాని తండ్రి మల్లేశం వారిని హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. గత రాత్రి తన పిల్లలను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించగా భార్య వచ్చి చూసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆమె తన పిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది.అయితే అప్పటికే కూతురు అర్చన ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande