
కోల్కత్తా, 16 నవంబర్ (హి.స.)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈడెన్
గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేదించక ముందు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. RSA మొదటి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులతో ఆలౌట్ అయింది. అయితే భారత జట్టు 124 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి చేరింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు