మేడారం వనదేవతల సన్నిధిలో భక్తుల సందడి
ములుగు, 16 నవంబర్ (హి.స.) ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారళమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తడి దుస్తులతో గద
మేడారం సమ్మక్క


ములుగు, 16 నవంబర్ (హి.స.)

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారళమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తడి దుస్తులతో గద్దెల వద్దకు చేరుకొని పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర పరిసర ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, చిలకల గట్టు సార్లమ్మ గుడి తదితర ప్రాంతాలను సందర్శించారు. పలు మొక్కులు తీర్చుకున్న భక్తులు అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్బంగా భక్తులకు ట్రాఫిక్ సమస్య తేలేత్తకుండా తాడ్వాయి పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande