కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి
ఖమ్మం, 16 నవంబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి వారి కీర్తి ప్రతిష్టలను పెంచుతానని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణ రాగ బిఈడి బిఈడి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సత్తుపల్లి పట్టణ వా
మంత్రి పొంగులేటి


ఖమ్మం, 16 నవంబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి వారి కీర్తి

ప్రతిష్టలను పెంచుతానని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణ రాగ బిఈడి బిఈడి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సత్తుపల్లి పట్టణ వారి కార్తీక మాస వన సమారాధనకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 2013 నుంచి రాజకీయాల్లో ప్రవేశించినప్పటి భగవంతుడు తనకిచ్చిన శక్తి మేరకు రెడ్డి వారి కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. భగవంతుడు తనకిచ్చిన దానిని పక్క వారికి సహాయం చేసేందుకు కుల మత రాజకీయాలకతీతంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande