
జనగామ, 16 నవంబర్ (హి.స.)
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100 శాతం రాయితీతో అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్లో సుమారు 12 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ధర్మసాగర్ చెరువు రిజర్వాయర్ లా కాకుండా పర్యాటక కేంద్రంగా చేపల రకాలను బట్టి ఏ చేపలను ఏ నిష్పత్తిలో విడుదల చేయాలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు