
భద్రాద్రి కొత్తగూడెం, 16 నవంబర్ (హి.స.)
ఇల్లెందు మున్నూరు కాపులు ఐక్యతగా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ మున్నూరు కాపు వన సమారాధన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్నూరు కాపులు రాజకీయ, వ్యాపార, విద్యా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. కార్తీకమాసంలో ఉపవాస దీక్షలతో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు వ్రతాలు చేస్తున్న అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సమస్య ఏదైనా నేరుగా తనకు వచ్చి చెబితే కచ్చితంగా పరిష్కరిస్తారని సభాముఖంగా ఎమ్మెల్యే తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు