
న్యూఢిల్లీ, 16 నవంబర్ (హి.స.)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తీసుకున్న కీలక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు, 2021 కు ఆమోదం ఇవ్వకుండా నిలిపివేయాలని రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్టాలిన్ అభిప్రాయపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం నిరాకరించడంతో ఈ అంశం మళ్లీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిర్ణయాన్ని కొట్టివేయాలని, బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..