ఐ-బొమ్మ, బప్పం టీవీ సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం
హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐ-బొమ్మ, బప్పం టీవీ సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైట్‌లు క్రియేట్ చే
ఐ-బొమ్మ, బప్పం టీవీ సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐ-బొమ్మ, బప్పం టీవీ సైట్లను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైట్‌లు క్రియేట్ చేసిన రవితోనే వాటిని క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే.. నిందితుడు ఐ బొమ్మ ఇమ్మడి రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. రూ. 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.. వైజాగ్‌కి చెందిన రవి టెక్నికల్ ఎక్స్పర్ట్ గా గుర్తించారు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ ఐనా, ఎంత సెక్యూర్‌గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలిగే ట్యాలెంట్ ఉంది. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్‌ను సైతం హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డగా చేసుకుని i-bomma website లో అప్లోడ్ చేశాడు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande