కార్తీక మాసం చివరి ఆదివారం యాదాద్రి నరసన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట, 16 నవంబర్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నందలి యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూలైన్లన్ని నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడ
యాదగిరిగుట్ట


యాదగిరిగుట్ట, 16 నవంబర్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నందలి యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూలైన్లన్ని నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కార్తీక మాసం చివరి ఆది వారం కావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ మాడ వీధులు రద్దీగా మారిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande