
అమరావతి, 17 నవంబర్ (హి.స.)
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో రైతులు చెట్ల కిందకు వెళ్లొద్దని, మత్య్సకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV