
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలంగాణ వాసులు మరణించడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హజ్ యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై అందులోని 42 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..