
న్యూఢిల్లీ, 17 నవంబర్ (హి.స.) పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి
వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేం తీసుకోవాలా? అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు స్పందించిన స్పీకర్ నోటీసులపై కార్యాలయం.. దీనిపై 8 వారాల సమయం కావాలని కోరింది. మరో నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని సుప్రీం ధర్మాసనం స్పీకర్ ను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..