
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
మెడ నరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా మ్యాచ్ నుండి వైద్యులకి ఆసుపత్రిలో చేరిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం నాడు తిరిగి జట్టు బస చేస్తున్న హోటల్కు చేరుకున్నారు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో గిల్ మెడ గాయం కారణంగా బ్యాటింగ్కు రాలేదు. శనివారం గాయపడిన గిల్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. అతన్ని మొదట ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను నడవగలుగుతున్నారని అలాగే మెడను కదపడానికి పెద్దగా ఇబ్బంది పడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో అతన్ని పరామర్శించి 15 నిమిషాలు మాట్లాడారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..