
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.) ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..