
అదిలాబాద్, 2 నవంబర్ (హి.స.)
రైతులు పండించిన సోయా పంటను ఎకరానికి 7.6 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నారని,దాన్ని 10 క్వింటాలు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం సోయా కొనుగోలు కేంద్రాన్నీ ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా కొనుగోళ్లను ఎకరానికి పది క్వింటాలకు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి రైతుల సమస్యలను విన్నవించారు. రైతుల సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ పంటలను ప్రభుత్వాలు మద్దత్తు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.గతంలో అధికారంలో ఉన్న నాయకులు అప్పుడు రైతులను పట్టించుకోలేదని,ఇప్పుడు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు