శ్రీకాకుళం జిల్లా లో.విద్యుత్ స్తంభాన్ని డీ.కొట్టిన ఘటనలో.యువకుడు మృతి
అమరావతి, 2 నవంబర్ (హి.స.) కవిటి గ్రామీణం: విద్యుత్ స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా గజపతికి చెంది
శ్రీకాకుళం జిల్లా లో.విద్యుత్ స్తంభాన్ని డీ.కొట్టిన ఘటనలో.యువకుడు మృతి


అమరావతి, 2 నవంబర్ (హి.స.)

కవిటి గ్రామీణం: విద్యుత్ స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా గజపతికి చెందిన జి. శివాజీ (25) భారత్ గ్యాస్ మెకానికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో కవిటి మండలం జగతి సమీపంలోని మలుపు వద్ద శివాజీ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివాజీ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం కవిటి మండలానికి పరిశీలనకు వచ్చిన శివాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని భారత్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande