పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, 2 నవంబర్ (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం గుమ్మడవెల్లి, రామకృష్ణాపూర్, రాఘవరెడ్డి పేట, ఎంపెడు, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివ
ఎమ్మెల్యే గండ్ర


జయశంకర్ భూపాలపల్లి జిల్లా, 2 నవంబర్ (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని

టేకుమట్ల మండలం గుమ్మడవెల్లి,

రామకృష్ణాపూర్, రాఘవరెడ్డి పేట, ఎంపెడు, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం పరిశీలించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే.. పంట నష్టపోయిన రైతులకు అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించి రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వారి వెంట మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ మరియు జిల్లా మండల నాయకులు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande