మంత్రులతో రేవంత్ రెడ్డి లంచ్ మీట్
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులందరితో ఆదివారం మధ్యాహ్నం లంచ్ మీట్ కు ఏర్పాట్లు చేయించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం కార్యాలయంలో ఈ లంచ్ మీట్ జరుగుతోంది. అనంతరం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో సమీక్ష నిర్వహించనున
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులందరితో

ఆదివారం మధ్యాహ్నం లంచ్ మీట్ కు ఏర్పాట్లు చేయించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం కార్యాలయంలో ఈ లంచ్ మీట్ జరుగుతోంది. అనంతరం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎంత బలం ఉంది? ప్రచారంలో ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు ఉన్న అవకాశాలు, తదితర విషయాలపై సీఎం చర్చించనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి మరోవారంరోజులే సమయం ఉండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలన్న విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ.. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande